నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలతోపాటు ఆర్జీవీ పేరు కూడా జత చేయండి
కొంతమంది సినిమాలు చేసి వాటి ద్వారా పేరు ప్రఖ్యాతులు కూడగట్టుకుంటారు. మరికొంతమంది సినిమాలు చేయకపోయినా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిలో రామ్‌గోపాల్‌వర్మను ముందుగా చెప్పుకోవచ్చు. అయితే ఈమధ్యకాలంలో వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో అతను డైరెక్ట్ చేసేవి కొన్నయితే అతని శిష్యులు డైరెక్ట్ చేసేవి కొన్ని. ఆమధ్య కొంతకాలం ఏ సినిమా చేయకుండా కేవలం వివాదాస్సద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండేవాడు. ఈమధ్యకాలంలో రామ్‌గోపాల్‌వర్మ వరసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే పవర్‌స్టార్ పేరుతో ఓ సినిమాను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు నటి పూనమ్ కౌర్ చేతిలో సినిమాలు లేకపోయినా వార్తల్లో ఉండే పనిలో ఉంది. ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో కనిపించడం ఆమె లక్ష్యం. అందులో భాగంగా రకరకాల అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాల్ని ధైర్యంగా వెల్లడిస్తుంది.
తాజాగా.. కొత్త సినిమా పవర్‌స్టార్‌కి సంబందించి వరుసగా కొన్ని ట్వీట్స్ చేశాడు వర్మ. ఈ సినిమాలో నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఓ రష్యన్ మహిళా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు టిక్ టాక్ ఫేమ్ పవన్ కళ్యాణ్ తన హీరో అని ప్రకటించాడు. దీనిపై స్పందించిన పూనమ్ ఈ సినిమాలో ఆర్జీవీ పేరు కూడా జత చేయమని కోరింది. అమ్మాయిల బలహీనతలు తెలుసుకుని, వారిని రెచ్చగొట్టడం, మళ్లీ ట్వీట్ల స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం లాంటివి చేసే వాడి పాత్రను కూడా పెట్టమని సలహా ఇచ్చింది. వర్మను తాను చిన్నతనంలో ఎంతో గౌరవించానని, కానీ ఇప్పుడు ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.













