టీడీపీలోకి నటి పూనమ్ కౌర్?
ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజులలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆమె కలుసుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కాదని తెలుగుదేశం పార్టీపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పు పడుతున్నారు. ఫలితంగానే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తితోనే తాజాగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. ఢిల్లీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రితో భేటీ కానున్న పూనమ్ కౌర్ రాజకీయాల పట్ల ఆస్తిని కనబర్చడం పాలకపక్షంలో ఆసక్తికరంగా మారింది. జనసేనతో ఆమెకు సంబంధం లేనప్పటికీ ఇటీవలి సంఘటనలతో బాధపడ్డారు. అయినప్పటికీ పూనమ్‌కౌర్ తెలుగుదేశంలోకి వెళ్ళడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనవసరంగా తనను వివాదాలలోకి లాగుతున్నారని ఆమె బాధపడ్డారు. అయితే అనూహ్యమైన పరిస్థితులలో రాజకీయాలలోకి రావాలనుకోవడం పలు సంచనాలకు దారి తీసే అవకాశాలున్నాయి.













