ఛాన్సుల కోసం హాట్ హాట్ ఫోటో షూట్!
2005 విడుదలైన `మొదటి సినిమా` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూనమ్ బజ్వా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం ఓ పాతిక సినిమాల వరకూ చేసింది. తెలుగులో మాత్రం 5 సినిమాలే చేసింది. నాగార్జున `బాస్`, అల్లు అర్జున్ `పరుగు` వాటిల్లో చెప్పుకోదగ్గ సినిమాలు. ఆ తర్వాత సౌత్‌లోని ఇతర భాషల్లో కొన్ని సినిమాలు చేసినా ఆమె కెరీర్లో ఎలాంటి మార్పూ లేదు. ముంబాయిలో మోడల్‌గా ఉన్న పూనమ్‌కి బాలీవుడ్లో ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదట. ఆమె `మొదటి సినిమా` తెలుగులోనే. అయితే `పరుగు` తర్వాత తెలుగులో కనిపించింది తక్కువే. ఇతర భాషల్లో ఏడాదికి రెండు మూడు సినిమాల్లో ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూనే ఉంది.
దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత క్రిష్ డైరెక్షన్లో రూపొందిన `ఎన్.టి.ఆర్. కథానాయకుడు` చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్లో కనిపించింది. గత సంవత్సరం కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం `కుప్పత్తు రాజా` చిత్రంలో ఓ క్యారెక్టర్ చేసింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం పూనమ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఇప్పుడు హాట్ హాట్‌గా ఫోటో షూట్ చేసిన స్టిల్స్‌ను బాగా సర్క్యులేట్ చేస్తోంది. వాటి్ వల్లయినా ఛాన్సులు రాకపోతాయా అని ఎదురుచూస్తోంది. మరి పూనమ్‌కి అవకాశం ఇచ్చే దర్శకనిర్మాతలు ఎక్కడ ఉన్నారో మరి.













