పూజిత పొన్నాడకు భారీ ఆఫర్…
తెలుగు బ్యూటీ పూజిత పొన్నాడ భారీ ఆఫర్ దక్కించుకుందని అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో వపన్‌కల్యాణ్ చేస్తున్న భారీ పీరియాడ్ డ్రామాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నారని. ఓ భారీ సెట్లో ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. పూజిత గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో ఓ రోల్ చేసింది. అంతేకాకుండా రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ రంగస్థలం మూవీలో అది పినిశెట్టి లవ్పాత్ర కూడా ఆమె చేసింది. పవర్‌స్టార్ లాంటి స్టార్ హీరో సరసన సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ కెరీర్‌కు ఇది ప్లస్సే అంటున్నారు. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉందన్న విషయం తెలిసిందే. మెఘలుల కాలం నాటి పీరియాడ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో పవన్ రాబిన్‌హుడ్ తరహాలో సాగే బందిపోటు పాత్ర చేస్తున్నారని ప్రచారం. సీనియర్ ప్రొడ్యూసర్ ఎఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా లాక్‌డౌన్‌తో షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది.













