బాలీవుడ్ పైనే పూజ హెగ్డే దృష్టి
సినీ ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం స్టార్ లు మారుతుంటారు. ఏ శుక్రవారం ఎవరు స్టార్ అవుతారో ఊహించలేరు. అలాంటి ఇండస్ట్రీలో బాలీవుడ్ సక్సెస్ అవలేక టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి చాలా తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందుకుంటూ గెస్ట్ రోల్ నుంచి, స్పెషల్ సాంగ్, హీరోయిన్ ఏ ఛాన్స్ అయినా సరే వదలకుండా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.
అల వైకుంఠపురములో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటుగా, ప్రభాస్ తో పాన్ ఇండియన్ ఫిల్మ్ రాధేశ్యామ్ లో నటిస్తున్న పూజ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే పెట్టింది. బాలీవుడ్ లో కూడా పూజ కు మంచి ఆఫర్సే వచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆచార్య లో రామ్ చరణ్ సరసన నటించడానికి ఒప్పుకున్న పూజ ఇప్పుడు ముంబై లో బీచ్ ఫేసింగ్ లో ఒక ఇల్లు కొనేసిందట. దీంతో పూజ టాలీవుడ్ ఫ్యాన్స్ తెగ కలవరపడుతున్నారు. ముంబై లో ఇల్లు కొనిందంటే ఇక పూజ అక్కడే సెటిల్ అవనుందా? అనే ఆందోళనలో పడిపోయారు.
దానికి కారణం రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలే. పూజా తో హ్యాట్రిక్ మూవీ చేయాలనుందని, అది కూడా టాలీవుడ్ లో సినిమా చేస్తేనే అని కామెంట్ చేశాడు. పూజ బాలీవుడ్ ప్లాన్స్ తెలిసే బన్నీ ఇలా అన్నాడా అని అందరూ అనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఒక్క హిట్ వచ్చినా, మళ్లీ టాలీవుడ్ వైపు చూడకుండా కియారా అద్వానీ లానే ముంబైలో సెటిల్ అవ్వాలని చూస్తుందా? అనే అనుమానంతో ఉన్నారు అభిమానులు.













