టిల్లూ సినిమాలో బుట్టబొమ్మ?
చిన్న హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, బన్నీతో చేసిన డీజే మూవీ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ అయిపోయింది. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. ఒకానొక టైమ్ లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి పూజా చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు.
రీసెంట్గా పూజాను సరిపోదా శనివారం మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేశారన్నారు. కానీ సడెన్ గా తెరపైకి ప్రియాంక అరుళ్ మోహన్ వచ్చింది. దీంతో పూజాకు ఆఫర్లు లేక సోషల్ మీడియాతో టైమ్ పాస్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో పూజా కు టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చిందని వార్తలొస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్ర చేస్తుందని మొదట్లో అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా సమంత ఏడాది పాటూ బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. సమంత వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఆమె ప్లేస్ లో పూజా తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నందినీ రెడ్డి డిసైడైందని టాక్. మరి ఈ విషయంలో నిజమెంతన్నది తెలియాలంటే నందినీ నుంచి క్లారిటీ రావాల్సిందే.













