పూజ హెగ్డే కు మరో మంచి అవకాశం
తెలుగు చిత్ర సీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతోంది పూజా హెగ్డే. బాలీవుడ్లో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో చిత్రాల్లో నటించినా భారీ విజయాలు అయితే దక్కలేదు. అయినా ఆమెకు అక్కడా అవకాశాలు తగ్గలేదు. తాజాగా ఆమెకు మరో మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌తో ఆడిపాడనుంది పూజా హెగ్డే. సల్మాన్‌తో ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించనున్న చిత్రం కభీ ఈద్ కభీ దివాలీ. సాజిద్ నడియాడ్వాలా నిర్మించుకున్న ఈ చిత్రాన్ని 2021 ఈద్‌కు విడుదల చేయనున్నారు. ఈ ఈద్‌కు రాదేగా రాబోతున్నారు సల్మాన్. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. పూజాహెగ్డే తెలుగు లో ప్రభాస్ చిత్రంతో పాటు, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిర్ లో నటిస్తోంది.













