పూజా తెలుగు సినిమాలు అందుకే చేయట్లేదా?
కొంతకాలం పాటూ టాలీవుడ్ ని ఏలిన పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ ను కాదని బాలీవుడ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఏకంగా మహేష్ బాబు తో చేస్తున్న గుంటూరు కారం సినిమాను సైతం వదులుకుంది. అప్పటికే పూజా చేతిలో ఓ హిందీ సినిమా ఉంది. ఈ సినిమా కోసమే పూజా గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది.
ఆ తర్వాత మరో తెలుగులో సినిమా ఛాన్స్ వచ్చినా పూజా నో చెప్పిందని టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే పూజా ఇప్పుడు మరో రెండు హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ కోయి శక్ సినిమాలో పూజాని హీరోయిన్గా ఫిక్స్ చేశారట ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.
ఈ సినిమాతో పాటూ పూజా, ఆయుష్మాన్ ఖురానా, రణ్ వీర్ సింగ్ కొత్త సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కించుకుందని టాక్ వస్తుంది. మొత్తానికి పూజా కెరీర్ లైనప్ చూస్తుంటే మళ్లీ టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ సినిమాలు చేయడం కష్టంగానే అనిపిస్తుంది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉందని, దానికి తోడు టాలీవుడ్ లో కంటే అక్కడ మంచి క్యారెక్టర్లు పడుతున్నాయని, అందుకే పూజా బాలీవుడ్ వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.













