తెలుగులో మరో భారీ ప్రాజెక్టుకు పూజా గ్రీన్‌సిగ్నల్
పూజా హెగ్డే తెలుగులో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కుంచుకుంది. ఈసారి అఖిల్ అక్కినేని చిత్రంలో కథానాయికగా చేసేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ఈమె ప్రభాస్ సినిమాలో కథానాయికగా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా షెడ్యూల్ నవంబర్‌కి మారడంతో ప్రస్తుతం చిత్రీకరణ మొదలు కానున్న అఖిల్ చిత్రంలో చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన నటించేందుకు గానూ పూజా భారీగానే పారితోషికం తీసుకుంటుందట. వచ్చే వారం నుంచి ఈ చిత్రం షూటింగ్లో పాల్గొననుంది. ఈ చిత్రం అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం పూజా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న అల వైకుంఠపురములో ను కథానాయికగా నటిస్తోంది. నవంబర్ నుంచి ప్రభాస్ హీరోగా రూపొందనున్న సినిమా షూటింగ్ పాల్గొననుంది.













