పవన్ కళ్యాణ్ సినిమాకి హ్యాండ్ ఇచ్చిన పూజా హెగ్డే
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా కూడా ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా ఒకటి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. పవన్‌కళ్యాణ్ సరసన హీరోయిన్గా నిత్య మీనన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్‌కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలు చేస్తున్నారు.
గతంలో హరీశ్ శంకర్, పవన్‌కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకూ వరుస ఫ్లాప్‌లతో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటివరకూ ఆయన కెరీర్లోనే అతి పెద్ద హిట్ సినిమాగా ఇది నిలిచింది. దీంతో ఈ కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది అని తెలియగానే.. అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. రీసెంట్‌గానే ఈ సినిమా టైటిల్‌ను వెల్లడించారు. అయితే అధికారికంగా ఈ సినిమాను దసరా పండుగ రోజున ప్రారంభిస్తారు అని ప్రకటన వచ్చింది. కానీ, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే డేట్లు కుదరకపోవడంతో.. సినిమా ప్రారంభం వాయిదాపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరోసారి పవన్ అభిమానులకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది.













