పూజాకు లక్కీ ఆఫర్లు
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ విజయ పథంలో ఉన్నారు. తెలుగులో ఆమె ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీతో పాటు, వరుణ్‌తేజ్, వాల్మీకి మూవీలో నటిస్తుండగా, అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరక్కెనున్న చిత్రంలో కూడా పూజా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్లో మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. వరుణ్ ధావన్ హీరోగా రానున్న కూలీ నెంబర్ 1 మూవీతో పాటు సైఫ్ అలీఖాన్, టబు ప్రాధానపాత్రల్లో తెరకెక్కుతున్న జవానీ జానెమెన్ చిత్రంలో హీరోయిన్గా పూజా నటించనుంది. గతంలో హృతిక్ హీరోగా తెరకెక్కిన మొహంజదారో అనే భారీ పీరియాడిక్ మూవీలో పూజా హీరోయిన్గా చేసింది.













