పింక్ రీమేక్‌లో పూజ?
అవకాశాల్ని అందుకోవడంలో జోరు ప్రదర్శిస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె తదుపరి పింక్ తెలుగు రీమేక్‌లో మెరవనుందని సమాచారం. హిందీలో విజయవంతమైన పింక్ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీకపూర్ కలిసి తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. హిందీలో తాప్సి పొషించిన పాత్ర కోసం పూజా హెగ్డేని సంప్రదించగా, ఆమె పచ్చజెండా ఉపినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తారు. న్యాయస్థానం నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.













