ఆచార్య కు కీలకం కానున్న పూజా క్యారెక్టర్
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఆచార్యలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర చేయనున్నాడు. చిరూ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే, చరణ్ కు జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. రెజీనా ఒక స్పెషల్ సాంగ్ చేసి కనువిందు చేయనుంది.
చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆచార్యలో పూజా క్యారెక్టర్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో పూజా క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని.. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ క్యారెక్టర్ ఉంటుందని, అందులో చరణ్ తో ఒక పాట కూడా ఉండనుందని తెలుస్తుంది. పూజ స్క్రీన్ టైమ్ తక్కువే అయినా ఆచార్య సినిమాకు తన క్యారెక్టర్ చాలా కీలకమని తెలుస్తుంది.
ఇప్పటికే పూజ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజ కు ఆచార్య ఎలాంటి పేరును తెచ్చిపెడుతుందో చూడాలి మరి. ఇదిలా ఉంటే చిరూ, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య మీద అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. కొరటాల గత సినిమాల మాదిరే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మే 13న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు.













