Pooja Hegde: మళ్లీ బిజీ అయిన పూజా
గత రెండేళ్ల కిందట వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే(Pooja Hegde) కు తర్వాత వరుస పరాజయాలు ఆఫర్లు తగ్గేలా చేశాయి. రాధే శ్యామ్(Radhe Shyam), బీస్ట్(Beast), ఆచార్య(Acharya), కిసీకా భాయ్ కిసీకా జాన్(kisika Bhai Kisika jaan), సర్కస్(Circus) సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టేయడంతో అవకాశాలు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ పూజా బిజీగా మారిపోయింది.
కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య44(Suriya44) సినిమాను పూజా ఇప్పటికే పూర్తి చేసింది. గ్యాంగ్ స్టర్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందింది. విజయ్(Vijay) పాలిటిక్స్ లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి సినిమాలో కూడా పూజానే హీరోయిన్. రాఘవ లారెన్స్(Raghava Lawrence) కాంచన4(Kanchana4) లో కూడా పూజా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ దాదాపు ఖాయమంటున్నారు. వరుణ్ ధావన్(Varun Dhawan) తో డేవిడ్ ధావన్(David Dhawan) రూపొందించే కామెడీ సినిమాలో కూడా పూజా ఉంది. ఇది కాకుండా షాహిద్ కపూర్(Shahid Kapoor) తో చేసిన దేవా జనవరి చివరి వారంలో రిలీజ్ కానుంది. మొత్తంగా చూసుకుంటే తెలుగులో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ పూజాకు మంచి ఛాన్సులే వస్తున్నాయి. మరి ఈసారైనా అమ్మడు వరుస హిట్లు అందుకుంటుందేమో చూడాలి.













