పూజా కోరుకున్న బ్రేక్ దొరికినట్టేనా?
మొన్నటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న పూజా హెగ్డే కెరీర్ ఉన్నట్టుండి ఆగిపోయినట్లైంది. కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన ఐరన్ లెగ్ ట్యాగ్ ను మళ్లీ తెచ్చుకునేలా పూజా 2022లో భారీ డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. అయినా సరే లక్ బాగుండి మహేష్ సరసన గుంటూరు కారంలో ఛాన్స్ అందుకుంది. కానీ ఉన్నట్లుండి ఆ సినిమా నుంచి పూజా తప్పుకుంది.
ఆ తర్వాత టాలీవుడ్ నుంచి అమ్మడుకి ఎలాంటి ఆఫర్లు వెళ్లలేదు. తిరిగి మళ్లీ ఇప్పుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించనుందని వార్తలొస్తున్నాయి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాలి. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇప్పుడు ఓ క్రేజీ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించబోయే సినిమాలో పూజాని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జూన్ 2న ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని చెన్నై వర్గాల టాక్. కార్తీక్ సుబ్బరాజ్ తీసిన జిగర్తండా డబుల్ ఎక్స్ తమిళంలో హిట్టైంది కానీ మిగిలిన భాషల్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా సరే స్టార్ హీరోలందరికీ కార్తీక్ మీద ఎక్కడ లేని నమ్మకం. అందుకే సూర్య అతనికి ఛాన్స్ ఇచ్చాడు. భారీ బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజాకు ఛాన్స్ వచ్చిన మాట నిజమే అయితే అమ్మడి ఇన్నాళ్ల వెయింట్ కు బ్రేక్ దొరికినట్లే.













