సైలెంట్ గా పని కానిచ్చేసిన పూజా
చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్(Tollywood) బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) సూర్య44 (Suriya44) వ సినిమాకు హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో వస్తోన్న ఈ లవ్ అండ్ వార్ పీరియాడిక్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అండమాన్ లో మొదలై అప్పటినుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య(Suriya) గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.
విక్రమ్(Vikram) క్లైమాక్స్ లో గ్యాంగ్స్టర్ గా నటించి విధ్వంసం సృష్టించిన సూర్య, ఆ తర్వాత ఏకంగా ఆ సినిమాలోని క్యారెక్టర్ పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్లీ కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కోసం సూర్య గ్యాంగ్స్టర్ గా మారాడు. ఈ సినిమాలో పూజా సూర్యకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుంచి మిగిలిన వారితో పాటూ పూజా కూడా షూటింగ్ లో పాల్గొంటుంది.
అయితే తాజాగా పూజా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు స్వయంగా తెలిపింది. సూర్య44 లాంటి మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేసిన పూజా ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందనేది మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న ఒకే ఒక్క తమిళ సినిమా ఇదే కావడంతో దీనిపైనే పూజా బోలెడు ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా పూజా హెగ్డేకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













