వాల్మీకి లో పూజ లుక్ విడుదల
జిగేల్ రాణి సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తోంది. వాల్మీకి సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డే అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రంలో పూజా లుక్ విడుదల చేశారు. పాత్ర పేరు శ్రీదేవి. పూజా హేగ్డె అవగానే మోడరన్ దుస్తుల్లో కనిపించడం తెలిసిందే. దానికి భిన్నంగా ఇలా కనిపించి కనువిందు చేసింది. 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తుండగా వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్. వాల్మీకికి దేవికి మధ్య దర్శకుడు ఎలాంటి రొమాంటిక్ లవ్ ట్రాక్ సేట్ చేశాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.













