అఖిల్‌తో పూజా ఆటపాట
తెలుగు చిత్రసీమలో కన్నడ కస్తూరి పూజా హెగ్డే హవా నడుస్తున్నది. పలు భారీ చిత్రాల్లో కథానాయికగా ఈ సుందరి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇటీవల రంగస్థలం, మహర్షి సినిమాలో తళుక్కున మెరిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ వయ్యారి అక్కినేని అఖిల్ సరసన నటించబోతున్నట్లు తెలిసింది. బొమ్మరిల్లూ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. బన్నివాసు నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డే ఖారారైంది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో ఇల వైకుంఠపురములో, వాల్మీకి చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.













