ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న బుట్టబొమ్మ
ఇప్పుడైతే బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫామ్ తగ్గింది కానీ మొన్నటి వరకు అమ్మడి డిమాండ్, క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుంటూరు కారం ఒప్పుకున్నాక ఆ సినిమాను వదిలేసుకోవడం ఫ్యాన్స్ ను ఇప్పటికీ బాధ పెడుతోంది. ఇదిలా ఉంటే పూజా త్వరలోనే డిజిటల్ డెబ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నెట్ఫ్లిక్స్ నిర్మించబోయే ఓ భారీ చిత్రంలో నటించేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. విజయ్ కోబ్రా, అంజలి సిబిఐ సినిమాలకు దర్శకత్వం వహించింది అజయ్ జ్ఞానముత్తునే.
హరర్ జానర్ లో డిమాంటీ కాలనీ చేశాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పుడు అజయ్, పూజాతో నెట్ ఫ్లిక్స్ కోసం హారర్ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ క్యారెక్టర్లకే పరిమితమైన పూజా, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమ్మడి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.













