పూజా కెరీర్ పుంజుకుంటున్నట్లే
పూజా హెగ్డే నటించిన మొదటి రెండు సినిమాలు ముకుంద, ఒక లైలా కోసం ఫ్లాప్ అయినా, తర్వాత చేసిన దువ్వాడ జగన్నాథం సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్, ప్రభాస్ ఇలా పెద్ద మీరోల సరసన నటించి తెలుగు కొన్నేళ్ల పాటూ ఓ వెలుగు వెలిగింది పూజా. కానీ ఎంతటి ఫామ్ లో ఉన్న హీరోయిన్ కైనా వరుస ఫ్లాపు లు కెరీర్ కు బ్రేకులేస్తాయి.
పూజా నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వరుసగా డిజాస్టర్లవడంతో పూజాకి ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పూజా మిడ్ రేంజ్ సినిమాల్లో చేయడానికి కూడా రెడీ అయినప్పటికీ అవకాశాలు రాలేదు. ఇలాంటి టైమ్ లో పూజాకి సౌత్ నుంచి ఓ బంపరాఫర్ వచ్చింది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన పూజా ఛాన్స్ కొట్టేసింది.
గతేడాది జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమాతో కోలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్, సూర్యతో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజాను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. పూజాకు అవకాశాలేమీ రాని టైమ్ లో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిందంటే మళ్లీ అమ్మడి కెరీర్ పుంజుకుంటున్నట్లే లెక్క. సూర్య హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.













