పొలిమేర2 అసలు సస్పెన్స్ అదే
రెండేళ్ల ముందు హాట్ స్టార్ లో రిలీజైన మా ఊరి పొలిమేర సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. రిలీజైన టైమ్ లో కంటే ఈ సినిమాకు తర్వాత్తర్వాత మంచి ఫాలోయింగ్ పెరిగింది. చేతబడుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కొన్ని ట్విస్టులు ప్రేక్షకులకు మతి పోగొడతాయి. ఓటీటీలో సూపర్ హిట్ రేంజ్‌కు వెళ్లిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈ సీక్వెల్ కోసం చాలా మంది తెగ వెయిట్ చేస్తున్నారు. నవంబర్ 3న మా ఊరి పొలిమేర2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు బన్నీ వాసు, నందిపాటి వంశీ కలిసి కొని రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే దీన్ని కొత్త కథతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పొలిమేర1 లో ఉన్న ప్రధాన పాత్రలతో పాటూ మరి కొంత మంది కొత్త నటులు కనిపిస్తున్నారు.
ట్రైలర్ చూశాక ఈ సినిమా మిస్టరీగా మారిన ఓ గుడి నేపథ్యంలో సాగేట్లు అర్థమవుతుంది. అందరూ భయంతో వణికిపోయే గుడిలోకి కొమరయ్య వెళ్లి ఏం చేశాడనేదే సస్పెన్స్ గా మారింది. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను మొదటి పార్ట్ కంటే కొంచెం గ్రాండ్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. పొలిమేర2 ఈసారి ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ కానుంది.













