ముందుకొచ్చిన పిఎం నరేంద్ర మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పిఎం నరేంద్ర మోదీ. జమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బోమన్ ఇరానీ, దర్శన్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 12న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వారం ముందుగానే విడుదల కానుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ ఒబెరాయ్, సందీప్ సింగ్, ఆనంద్ పండిట్, ఆచార్య మునీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హిందీతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.













