సెట్స్ పైకి మోదీ బయోపిక్
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత నేపథ్యంలో దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆ మధ్య చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, దీనిపై భిన్న స్పందనలు వినిపించాయి. అయితే ఈ చిత్రం సోమవారం సెట్స్ పైకి వెళ్లింది. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ బయోపిక్ షూటింగ్ ప్రారంభమైందని, గుజరాత్‌లోని పలు లొకేషన్లలో చిత్రీకరణ కొనసాగుతుందని బాలీవుడ్ విశ్లేషకులు, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ మూవీలో వివేక్ ఓబెరాయ్‌తో పాటు బొమన్ ఇరానీ, దర్శన్ కుమార్ వంటి నటులు నటిస్తున్నారు. సుషేర్ ఓబెరాయ్, సందీప్ సింగ్‌లు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు.













