వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు : ప్రధాని
టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జయప్రకాశ్ రెడ్డి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన జయ ప్రకాశ్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు.













