పందెంకోడి-3 చేస్తా
కథానాయకుడిగా విశాల్‌కు మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని అభిమానగణాన్ని తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి. పదమూడేళ్ల క్రితం ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం ఆయన కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇటీవలే పందెంకోడీ-2 చిత్రం రూపొందింది. ఈ చిత్రాల స్ఫూర్తితో పందెంకోడి-3 చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు విశాల్. ఆయన మాట్లాడుతూ పందెంకోడి చిత్రానికి నా కెరీర్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కడకు వెళ్లినా అందరూ ఈ సినిమా పేరుతోనే నన్ను పిలుస్తున్నారు. సీక్వెల్ చేస్తున్న సమయంలో తొలి సినిమా స్థాయిలో మళ్లీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలమా అని టెన్షన్ పడ్డాం. కానీ మేము ఊహించిన దానికంటే సీక్వెల్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. పందెంకోడి-3 చేయాలనే ఆలోచనలో ఉన్నాం. లింగుస్వామి కథను సిద్ధంచేసే పనిలో ఉన్నారు అని తెలిపారు. ప్రస్తుతం విశాల్ నాలుగు సినిమాలో బిజీగా ఉన్నారు. అవి పూర్తికాగానే పందెంకోడి -3 సెట్స్‌పైకి రానున్నట్లు తెలిసింది.













