‘ప్లాన్ బి’ విషయంలో ఏం జరిగిందనేది తెరపైనే
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర తదితరులు నటించిన తాజా చిత్రం ప్లాన్ బి. ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై కేవీ రాజమహి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న విడుదలకు రెడీ అయ్యింది. దర్శకుడు మాట్లాడుతూ కథ ప్లాన్ బి చుట్టూ నడుస్తుందంటే, ప్లాన్ ఏ విషయంలో ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి అన్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, ఆద్యంతం ఉత్కంఠతో సరికొత్త కథనంతో థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ అన్నారు. సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికెట్ వచ్చిందన్నారు. నిర్మాత మాట్లాడుతూ కథ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని అంశాలతో రూపొందిన చిత్రమిది. రాజమహికి ఇదే తొలి చిత్రమైనా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా తీర్చిదిద్దారన్నారు.













