పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త
పవన్ అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చేసింది. ఎట్టకేలకు పవన్ రీ ఎంట్రీ పై క్లారిటీ దొరికింది. ఆయన పింక్ మూవీ రీమేక్ చేయనున్నట్లు సృష్టమైన ప్రకటన రావడం జరిగింది. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ హిందీ హిట్ మూవీ రీమేక్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బోనికపూర్ దిల్ రాజు నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరిగింది. దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ నేడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ని కలవడంతో పాటు పింక్ రీమేక్ కొరకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాము అని అధికారికంగా ప్రకటించారు. ఇక థమన్ కూడా నా మొదటి బిగ్ ప్రాజెక్ట్ హీరో గారితో అని ట్వీట్ చేశారు. గతంలో పవన్‌తో థమన్ పని చేసింది లేదు. దీనితో వీరు హీరో పేరు ప్రకటించినప్పటికీ అది పవన్ సినిమా అన్న విషయంపై సృష్టం అవుతుంది. ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ ని వెండి తెరపై చూడాలని ఆశపడుతున్న అభిమానులకు ఇది పండుగలాంటి వార్త అని చెప్పాలి.













