బ్రో కు కష్టాలు తప్పేలా లేవుగా..
ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎక్కువ సినిమాలు వస్తున్నప్పుడు ఒక డిజాస్టర్ ప్రభావం ఖచ్చితంగా తర్వాత రాబోయే వాటి మీద ఉంటుంది. ఆ నష్టాలను పూడ్చే క్రమంలో రేట్లు తగ్గించని పరిస్థితులు ఎదురవుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆదిపురుష్ సినిమాను చాలా ఎక్కువగా అంచనా వేసి 185 కోట్లకు కొనింది.
పరిస్థితులు చూస్తుంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఆదిపురుష్ అమౌంట్ మొత్తం రికవరీ అవడం కష్టంగానే అనిపిస్తుంది. రోజు రోజుకీ ఈ సినిమ రెవిన్యూ బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పరిణామం బ్రో మీద పడొచ్చని టాక్. ఎందుకంటే బ్రో సినిమాను నిర్మించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే. రీసెంట్గా ఈ సినిమా బిజినెస్ డీల్స్ మొదలు పెట్టినట్లు టాక్.
బ్రో సినిమా రైట్స్‌కు పెద్ద మొత్తంలో రేట్లు చెప్పడంతో సినిమా ట్రైలర్ వచ్చేవరకు ఆగాలని బయ్యర్లు డిసైడ్ అయ్యారట. ఆదిపురుష్‌ని డిస్ట్రిబ్యూట్ చేసింది పీపుల్స్ మీడియానే కాబట్టి ఆ లాస్ కు బదులు బ్రో ని కాస్త తక్కువ రేటుకే అడుగుతారు బయ్యర్లు. ఎటూ తోచక తప్పక తగ్గించాల్సిన పరిస్థితి పీపుల్స్ మీడియాకు ఉంది.
దీంతో పాటూ బ్రో సినిమాకు రేట్లు పెంచుకునే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఇక ఏపీలో ఎలాగూ టికెట్ రేట్లు పెంచరు. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ నష్టాల గురించి పవన్ రీసెంట్గా ఓ సభలో బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. కాబట్టి ఎటు చూసిన బ్రో సినిమాకు కష్టాలు తప్పేలా లేవు.













