Writers Hunt: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసిన ఒక యూనిక్ రైటింగ్ కాంపిటేషన్ టేల్‘హంట్

క్రియేటివ్ ట్యాలెంట్ ని ప్రోత్సహించే లక్ష్యంతో టేల్‘హంట్ అనే సరి కొత్త స్టోరీ రైటింగ్ కాంపిటేషన్ ని డిసెంబర్ 11న సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory) అధికారికంగా ప్రకటించింది. వర్ధమాన కథకులు, ఔత్సాహిక రచయితలకు ఈ ఈవెంట్ ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని అని ప్రకటించారు.
డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపద కథలు, కోర్ట్‌రూమ్ డ్రామాలు, యాక్షన్, ఫాంటసీతో సహా పలు రకాల థీమ్స్ లో, ఇంగ్లీష్ లేదా తెలుగులో ప్రభావంతమైన కథనాలను రాయగల వారు ఈ పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నారు. కథలు 4 పేజీలకు మించకూడదు, పంపించే కథలు తప్పనిసరిగా ఒరిజినల్, ఇంతకముందు ఎన్నడూ, ప్రచురించబడనివిగా ఉండాలి.
నిర్వాహకులకు ఈ కాంపిటేషన్ గురించి మాట్లాడుతూ..ఈ పోటీ ప్రతిభను గుర్తించడం మాత్రమే కాకుండా రచయితలు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఎంటర్ టైన్మెంట్ పరిశ్రమలోని నిపుణులతో సమర్థవంతంగా పనిచేసే అవకాశం కలిగిస్తుంది అని చెప్పారు
ఈ ఈవెంట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయడానికి, PMFలో సీనియర్ టెక్నిషియన్స్ దగ్గర నుండి ఎంతో నేర్చుకోడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది అని తెలియచేశారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొండి, త్వరపడండి! ఎంట్రీలకు చివరి తేదీ డిసెంబర్ 16.
మరింత సమాచారం కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా హ్యాండిల్స్ బ్రౌజ్ చేయండి.