పీపుల్స్ మీడియా బ్యానర్ లో మల్టీ స్టారర్
టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఇప్పుడు సీక్రెట్ గా సినిమా షూటింగ్స్ జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ప్రభాస్-మారుతి సినిమా కనీసం అనౌన్స్ కూడా చేయకుండా దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు మారుతి-ప్రభాస్ గురించిన అప్డేట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది లేదు.
ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కూడా ఈ బ్యానర్ లో చాలా సైలెంట్ గా షూటింగ్ ను కొనసాగిస్తున్నాడట. రవితేజతో ఈగల్ సినిమా చేస్తున్న కార్తిక్ ఘట్టమనేని, ఇప్పటికే ఈగల్ మూవీని కంప్లీట్ చేసి, ఇదే బ్యానర్ లో మరో సినిమా షూటింగ్ కూడా కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ మల్టీస్టారర్ అని తెలుస్తోంది.
ఈ మల్టీస్టారర్‌లో మంచు మనోజ్, తేజ సజ్జ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. అంతేకాదు ఇందులో మరో హీరో కూడా ఉన్నాడని ఆ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40% పూర్తైందని, మిగిలిన షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చూస్తున్నారట.













