బ్రో సైలెన్స్ కు రీజన్స్ ఇవే..
రిలీజ్ కు ఇంకో నెల రోజులే టైమ్ పెట్టుకుని ఇంకా బ్రో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సిన భోళా శంకర్ సినిమా ఇప్పటికే టీజర్, లిరికల్ వీడియోను రిలీజ్ చేసి హంగామా చేస్తుంది.
కానీ బ్రో సినిమా మేకర్స్ మాత్రం కేవలం రెండు మూడు పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు. కాబట్టి ఫ్యాన్స్ ను చల్లబరిచే ప్రయత్నంలో భాగంగా బ్రో నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ తో ఫ్యాన్స్ అన్నీ మరచిపోయేలా చేశారు. పోస్టర్ లో పవన్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ ఊర మాస్ లుక్ లో కనిపించారు. ఈ పోస్టర్ ను చూశాక పవన్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.
అయితే అసలు బ్రో టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టకుండా ఇన్ని రోజులు సైలెంట్ గా ఎందుకున్నారనే దానికి రెండు కారణాలు తెలుస్తున్నాయి. అందులో ఒకటి జనసేన వారాహి యాత్ర. పవన్ చేపట్టిన ఈ యాత్రకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న టైమ్ లో పవన్ సినిమాలకు ప్రమోషన్లు చేస్తే జనం డైవర్ట్ అవుతారనేది ఒక రీజన్.
మరో రీజన్ 180 కోట్లతో తెలుగు రైట్స్ ను కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటం. ఇప్పుడు ఆదిపురుష్ ఫైనల్ రన్‌కు వచ్చింది. వారాహి యాత్రకు గ్యాప్ వచ్చింది కాబట్టి బ్రో సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలని చూస్తుంది చిత్ర బృందం. అందులో భాగంగానే త్వరలో టీజర్‌ను రిలీజ్ చేసి, ఆ తర్వాత గ్యాప్ లేకుండా సినిమా గురించి రోజుకో వార్తను హైలైట్ చేసేలా మేకర్స్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.













