mega157: ఆ సాంగ్ తో మెగా157 తుఫాన్ సృష్టిస్తుందా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర(viswambhara) ను పూర్తి చేసిన చిరూ, అనిల్ రావిపూడి(anil ravipudi)తో చేస్తున్న మెగా157(mega157)ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకోగా రీసెంట్ గా కేరళ షెడ్యూల్ ను ముగించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిస్తోంది.
కేరళ షెడ్యూల్ లో చిరంజీవి, నయనతారపై ఓ కలర్ఫుల్ సూతింగ్ మెలోడీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. పెళ్లి సందర్భంలో వచ్చే ఈ సాంగ్ ఆడియన్స్ కు కన్నుల పండుగగా ఉంటుందని మేకర్స్ ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో(bheems ciciroleo) సంగీతం అందించిన ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్(ananth sriram) సాహిత్యం అందించారు.
ఈ సాంగ్ లో చిరంజీవి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తారని, సాంగ్ లోని విజువల్స్ అందరినీ కచ్ఛితంగా అలరిస్తాయని చెప్తున్న ఈ పాటను చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసి బ్లాస్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి చిరూ బర్త్ డే కానుకగా టైటిల్, రిలీజ్ డేట్ ను రివీల్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఏది నిజమనేది తెలియాలి.







