Peddi-The Paradise: పెద్ది, ప్యారడైజ్ క్లాష్ తప్పేలా లేదుగా

టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల క్లాష్ అనేది రోజురోజుకీ పెద్ద సమస్యగా మారిపోతుంది. పలు సినిమాలు ఒకే వారంలో రిలీజవుతున్నాయి. ఇదేం కొత్త కాదు. అయితే ఒకేసారి ఎలాంటి సినిమాలు వస్తున్నాయనేది ముఖ్యం. ఇక అసలు విషయంలోకి వస్తే వచ్చే ఏడాది కొన్ని భారీ సినిమాలు రిలీజ్ కానుండగా, అందులో రెండు సినిమాలు క్లాష్ కు రెడీ అవుతున్నాయి.
ఆ సినిమాలే పెద్ది(peddi), ది ప్యారడైజ్(the paradise). రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేయగా, నాని(nani) హీరోగా దసరా(dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ మార్చి 26, 2026న రిలీజ్ కానున్నట్టు కూడా అనౌన్స్‌మెంట్ వచ్చింది.
అంటే రెండు పెద్ద సినిమాలూ ఒక రోజు గ్యాప్ లో రానున్నాయన్నమాట. మొన్నామధ్య ది ప్యారడైజ్ పెద్ద సినిమా అని, పోస్ట్ పోన్ అయి, సోలో రిలీజ్ అవుతుందన్నారు కానీ తాజాగా నాని ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టినట్టు ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వచ్చే ఏడాది మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ కానుందని డైరెక్టర్ కన్ఫర్మ్ చేయడంతో పెద్ది, ప్యారడైజ్ సినిమాల మధ్య క్లాష్ తప్పేలా లేదని కన్ఫర్మ్ అయింది.