పాయల్ షాకిస్తుందట?
దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ బయోపిక్‌లో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే సినిమాలో పాయల్ వేశ్య పాత్రలో నటిస్తున్నప్పటికీ కొన్ని సన్నివేశాల్లో పోలీస్ గెటప్‌లో కనిపించనుంది. అయితే సినిమాలో పాయల్ క్యారెక్టర్ బాగా బోల్డ్‌గా ఉంటుందట. ఇటీవలే షూటింగ్లో కొన్ని సీన్స్‌తోపాటు ఇంటర్వెల్ సీక్వెన్సును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు 1980-90 దశకాల్లో స్టువర్టుపురం గజదొంగగా భయానక వాతావరణాన్నే సృష్టించారు. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.













