లేడీ ఓరియెంట్డ్లో పాయల్
జయాపజయాలతో సంబంధం లేకుండా యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స 100తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి చిత్రంలోనే హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. ఇక ఇటీవల వచ్చిన ఆర్డిఎక్స్ లవ్ మూవీలో కూడా పాయల్ మంచి గ్లామర్ రోల్ చేయడం జరిగింది. అయితే విక్టీరీ వెంకటేష్‌తో చేసిన వెంకీ మామ చిత్రం ఈ బ్యూటీకి హీరోయిన్గా మంచి పేరును తీసుకువచ్చింది. తాజాగా గుణశేఖర్ దగ్గర పనిచేసిన ప్రాణదీప్ అనే దర్శకుడు పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంట్ మూవీ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ ఐపిఎస్ అధికారిణిగా నటిస్తోంది.













