నాగ్ సరసన పాయల్ రాజ్ పుత్ ?
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కతోంది. మన్మథుడు 2 పేరుతో సెట్స్‌పైకి వెళ్లనున్న ఆ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఆర్.ఎక్స్ 100తో వెలుగులోకి వచ్చిన కథానాయిక పాయల్. ప్రస్తుతం రవితేజతో డిస్కోరాజాలో నటిస్తున్న ఆమెని, ఇటీవల నాగ్‌తో కలసి నటించే అవకాశం వరించినట్టు తెలుస్తోంది. మన్మథుడి2 లో ఇద్దరు కథానాయికలకి చోటుండగా, ఓ నాయికగా పాయల్ని ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే పోర్చుగల్‌లో చిత్రీకరణ ఆరంభించబోతున్నారు. చి.ల.సౌ తో విజయాన్ని అందుకొన్న రాహుల్ రవీంద్రన్, నాగ్ కోసం ఆయన ఇదివరకు నటించిన మన్మథుడు తరహా కథని సిద్ధం చేశారు.













