బాలయ్యకు జోడిగా పాయల్ ?
నందమూరి బాలకృష్ణ- కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. సి.కల్యాణ్ నిర్మాత. ఈ చిత్రానికి రూలర్ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇద్దరు నాయికలుంటారు. ప్రస్తుతం వారి కోసం అన్వేషణ జరుగుతోంది. ఓ కథానాయికగా పాయల్ రాజ్పుత్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆర్.ఎక్స్ 100తో ఆకట్టుకున్న పాయల్‌కి వరుసగా అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం ఆర్డీఎక్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత. ఆయనే పాయల్‌కి మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. జూన్ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సంగీతం: చిరంతన్ భట్.













