ఆర్డీఎక్స్ ప్రారంభం
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో పోషిస్తున్న చిత్రం ఆర్డీఎక్స్. తేజస్ కీలక పాత్రధారి. శంకర్ భాను దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. విజయవాడలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అంబికా కృష్ణ క్లాప్‌నిచ్చారు. బుద్దా వెంకన్న కెమెరా స్విచ్చాన్ చేశారు. సి.కల్యాన్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ ఓ శక్తిమంతమైన కథ ఇది. అందుకు తగ్గ నటీనటులు కుదిరారు. విజయవాడ, పోలవరం, రాజమండ్రి పరసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుతామన్నారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నా పాత్రని బాగా తీర్చి దిద్దారు. ఆర్ ఎక్స్ 100లానే ఆర్డీఎక్స్ కూడా నాకు మంచి గుర్తింపు తెస్తుందని పాయల్ చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ బాంబు లాంటి అమ్మాయి కథ ఇది. అందుకే ఆ పేరు పెట్టామన్నారు. సంగీతం :రథన్













