నాకు విజయశాంతే స్ఫూరి…
ఐపీయస్ పాత్రలో నటించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. నేనా కలని ఈ చిత్రంతో నెరవేర్చుకున్నా అన్నారు కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 5డబ్ల్యూస్. సాదారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు అనేది ఉపశీర్షిక. ప్రణదీప్ ఠాకోర్ దర్శకుడు. యశధ ఠాకోర్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ నా సినీ ప్రయాణంలో నేను చేసుతన్న పూర్తిస్థాయి కొత్త చిత్రమిది. ఇందులో ఐపీఎస్ పాత్రని విజయశాంతిని స్ఫూర్తిగా తీసుకుని చేశా అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఒక పోలీస్ అధికారి జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాశా. పోలీసుల పరిశోధన ఎవరు? ఎమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ఐదు ప్రశ్నల నుంచే మొదలవుతుంది. అందుకు తగ్గట్టే పేరు నిర్ణయించాం అన్నారు.













