మంగళవారం బ్యూటీకి అవకాశాలివ్వండి గురూ
పంజాబీలో, హిందీలో ఒక్కో సినిమా చేసినా రాని క్రేజ్ పాయల్ కు ఆర్ఎక్స్ 100 సినిమాతో దక్కింది. తెలుగులో ఒక సినిమా హిట్టైతే వరుస అవకాశాలు రావడం కామన్. ఆర్ఎక్స్ 100 క్రేజన్ తో పాయల్ కు ఆ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. అయితే వాటిలో ఏ ఒక్కటీ పాయల్ రేంజ్ ను పెంచలేకపోయింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు అసలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా ఆడియన్స్ కు తెలీలేదు.
గతేడాది ఆర్ఎక్స్100 లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి తోనే మంగళవారం అనే సినిమా చేసి, తనలోని నటిని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమా ద్వారా పాయల్ ను మరోసారి మంచి నటిగా గుర్తించారు ఆడియన్స్. ఆ సినిమా తర్వాత మళ్లీ పాయల్ దూకుడు చూపిస్తుందనుకున్నారు కానీ అదేమీ జరగడం లేదు.
ప్రస్తుతం పాయల్ తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాతో పాటూ తెలుగులో కిరాతక అనే సినిమా చేస్తుంది. ఓ పక్క మిగిలిన హీరోయిన్లు సూపర్ క్రేజ్ తో వరుస అవకాశాలు అందుకుంటుంటే పాయల్ మాత్రం కెరీర్ లో అదే స్థాయిలో ఉంది. పాయల్ కు గ్లామర్ ను డైరెక్టర్లు సరిగా వాడుకుంటే ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు కానీ అమ్మడి దగ్గరకి అన్నీ ఆర్ఎక్స్100 లాంటి కథలే రావడంతో పాయల్ కూడా అలాంటి కథలను కాదంటుంది. దీంతో తనలోని గ్లామర్ సైడ్ ను మాత్రమే కాకుండా నటనా టాలెంట్ ను కూడా వాడుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.













