లిప్‌లాక్ సీన్స్ చేయాలంటే అమ్మ ఓకే చెప్పాల్సిందే!
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హాట్ హీరోయిన్ ఎవరు అంటే పాయల్ రాజ్‌పుత్ పేరే వినిపిస్తుంది. తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తో కుర్రకారులో ఉత్సాహాన్ని నింపిన పాయల్‌కి ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊహించిన రేంజ్లో లేదు. తొలి సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో ఆమెకు వచ్చిన క్రేజ్‌కి టాప్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. చక్కని అందం, మత్తెక్కించే కళ్ళు, మంచి అభినయం.. ఇవన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు అదృష్టం కూడా తోడవ్వాలని పెద్దలు ఊరకే చెప్పలేదనేది పాయల్ని చూస్తే అర్థమవుతుంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆ తరహా సినిమాలు ఆమెకు చాలా వచ్చాయి. కానీ, హాట్ హీరోయిన్గా తనపై ముద్ర పడిపోతుందన్న భయంతో వాటిని తిరస్కరించింది. ఆర్డిఎక్స్ లవ్, డిస్కోరాజా, వెంకీమామ వంటి సినిమాలు చేసినా అవి ఆమె కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ మూడు సినిమాల్లో వెంకీ మామ ఒక్కటే సూపర్‌హిట్ అయింది. అయితే ఆ సినిమా విజయం పాయల్‌కు పనికిరాలేదు. అయినా నిరాశ చెందకుండా తన కెరీర్‌ను ఓ గాడిలో పెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది. తాజా సమాచారం మేరకు రవితేజ సరసన నటించే అవకాశం పాయల్‌కు వచ్చిందట. తన కెరీర్ ఫ్యూచర్లో బ్రైట్‌గా ఉంటుందన్న నమ్మకం ఉందని పాయల్ చెబుతోంది.
పాయల్ మొదటి సినిమాలో ఆడియన్స్‌కి బాగా ఎట్రాక్ట్ అయింది ఆమె చేసిన లిప్‌లాక్‌ల వల్లే. సినిమాలోని కథ, కథనాలు, హీరో క్యారెక్టరైజేషన్, ఎమోషన్స్ ఇవన్నీ బాగున్నప్పటికీ యూత్ మాత్రం పాయల్‌ను లిప్‌లాక్‌లో చూసేందుకు పదే పదే సినిమాకు వెళ్ళేవారు. ఈ లిప్‌లాక్‌ల వెనుక ఉన్న కథ, భవిష్యత్తులో లిప్‌లాక్‌లు చేయాలంటే కండీషన్స్ ఏమిటనే విషయం గురించి పాయల్ మాట్లాడుతూ `నా తొలి సినిమాలో చాలా లిప్‌లాక్‌లు ఉన్నాయి. వాటిని అందరూ ఎంజాయ్ చేశారు. కానీ, అవన్నీ మా అమ్మ పర్మిషన్‌తోనే చేశాను. కథకు అవసరం కాబట్టే డైరెక్టర్ వాటికి ఉన్న ప్రాముఖ్యతను అమ్మకు వివరించడంతో అమ్మ కూడా ఒప్పుకుంది. ఇకముందు సినిమాల్లో కూడా లిప్‌లాక్‌లు అవసరం అయితే దానికి మా అమ్మ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ అమ్మ దానికి అభ్యంతరం చెబితే నేను ఆ సీన్స్ చేయలేను` అంటూ చెప్పుకొచ్చింది పాయల్. ఆర్ ఎక్స్ 100 విడుదలై రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఆ సినిమాలోని లిప్‌లాక్ గురించి ప్రస్తావించడం, అమ్మ పర్మిషన్ ఉంటేనే అవి చేస్తానని చెప్పడం చూస్తుంటే అందరికీ విడ్డూరంగానే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు కాబట్టి ఏదోవిధంగా వార్తల్లోకి వస్తే కాస్త ప్రచారం జరుగుతుందని అలా చేస్తోందని కొందరు భావిస్తుంటే. ఇకపై అమ్మ పర్మిషన్ తీసుకొని లిప్‌లాక్‌లు ఉన్న సినిమాలు చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని చెప్పకనే చెబుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి పాయల్ మనసులో ఏముందో!













