పాయల్‌కు ఇక ఆ ఆఫర్లేనా?
ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్గా అడుగుపెట్టిన పాయల్ రాజ్‌పుత్, మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత పాయల్ రేంజే మారిపోయింది. అనుకున్నట్లుగా పాయల్ కు ఆర్ఎక్స్100 తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా సినమాల్లో ఛాన్స్ కొట్టేసింది.
ఛాన్సులైతే వచ్చాయి కానీ ఆ రెండు సినిమాల వల్ల అమ్మడు కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు. అయితే పాయల్ ను అందరూ బోల్డ్ క్యారెక్టర్స్ లో చూపించడానికే ఇష్టపడుతున్నారు. ముందు అలాంటి అవకాశాలైనా వచ్చేవి కానీ క్రమంగా అవి కూడా తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో ఆర్ఎక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతితో మరోసారి జత కట్టి మంగళవారం అనే సినిమా చేసింది.
గత వారం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో కూడా పాయల్ క్యారెక్టర్ బోల్డ్ గానే ఉంది. వల్గారిటీ లేకపోయినా పాయల్ తప్ప ఈ పాత్రకు మరెవరూ న్యాయం చేయలేరన్నట్లుగా ఆ పాత్రలో పాయల్ మెప్పించి, సినిమాకు ప్రాణం పోసింది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన మంగళవారం సినిమా పాయల్ కు మంచి సక్సెస్ ను ఇచ్చింది.
కానీ మంగళవారం సక్సెస్ పాయల్ కు మళ్లీ కమర్షియల్ హీరోయిన్ స్టేటస్‌ను మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది. స్టార్ హీరోలతో పాయల్ నటించే అవకాశాలేమీ కనిపించడం లేదు. కనీసం మీడియం రేంజ్ హీరోలైనా అమ్మడుకి ఛాన్సులిస్తారేమో చూడాలి. పాయల్ కు ఆఫర్లు వస్తున్నాయి కానీ అవన్నీ ఫీమేల్ సెంట్రిక్ ఆఫర్లే కావడం, అవి కూడా ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్లే అవడం విశేషం. మరి తనకొచ్చిన ఆఫర్లలో పాయల్ ఎలాంటి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి.













