21 రోజులపాటు రోజూ 21 వాక్యాలు : పాయల్
కథానాయికలు లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఒకొక్కరు ఒక్కో రకంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. వాళ్లు రోజువారీగా ఏం చేస్తున్నారో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. కథానాయిక పాయల్ రాజ్పుత్ తెలుగు నేర్చుకొంటోంది. లాక్డౌన్ కొనసాగనున్న 21 రోజులపాటు రోజూ 21 వ్యాక్యాలు చొప్పున తెలుగు నేర్చుకుంటున్నట్లు ఆమె చెబుతోంది. అంతర్జాలం సహాయంతో ఆమె తెలుగు పదాల్ని హిందీలో రాసుకుంటూ సాధన చేస్తోంది. కష్టమైనా నేర్చుకుంటున్నానని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. కొత్త భాష నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లకి పాయల్ ప్రయత్నం స్ఫూర్తినిచ్చేదే కదా.













