ప్రత్యేక పాటలో పాయల్!
ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్‌తో ఓవర్‌నైట్‌లో సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. తన బోల్డ్నెస్ గ్లామర్‌తో కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తన వైపునకు తిప్పుకుంది ఈ బ్యూటీ. తాజాగా హీరోయిన్ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్-తేజ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. కాగా పాయల్ ఈ సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో చేయనుందని, అందుకు అమె ఇప్పటికే అంగీకరించిందని సమచారం. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకున్న హీరోయిన్ ఇలా ప్రత్యేక గీతాల్లో నటించేందుకు అంగీకరించిందంటే సాహసమే అని చెప్పాలి. ఈ సాహసం ఆమె కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ కానుందో చూడాలి.













