సీతలో పాయల్ ఆట పాట
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రత్యేక గీతంలో నటించేందుకు అంగీకరించింది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శకుడు. ఈ సినిమాలో పాయల్‌పై గీతాన్ని చిత్రీకరించారు. బుల్రెడ్డీ.. అనే పల్లవితో సాగే సీతాన్ని పెప్సీ మాస్ పాటగా తీశారు. ఈ పాటను నేడు విడుదల చేయబోతున్నారు. ఈ పాటలో పాయల్ మత్తెక్కించే నటన హైలెట్ అవుతుందని చిత్రబృందం పేర్కొంది. సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ 25న సీత ప్రేక్షకుల ముందుకురానుంది.













