జయప్రదగా హన్సిక… జయసుధగా పాయల్ రాజ్‌పుత్
బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంతో సంబంధం ఉన్న వ్యక్తులందరూ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడులో సినిమా భాగాన్ని చూపించబోతున్నారు. ఎన్టీఆర్‌తో జయసుధ, జయప్రద సినిమాలు చేశారు. వారి పాత్రల్లో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. అందులో ఆర్ఎక్స్ 100 కథానాయిక పాయల్ రాజ్‌పుత్‌ను జయసుధ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఆ పాత్రలో ఆమె చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక రెండో పాత్ర జయపద్ర క్యారెక్టర్ ప్రాతను చేసేందుకు హన్సికను ఎంపిక చేశారు.













