వెంకీమామ లో పాయల్ రాజ్ పుత్ జాయిన్
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్యల మల్టీస్టారర్ వెంకీమామ మొదటి షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. తాజాగా ఈ షెడ్యూల్లో పాయల్ రాజ్‌పుత్ జాయిన్ అయ్యింది. ఈ చిత్రంలో ఆమె వెంకీకి జోడీగా నటిస్తోంది. ఇక ఈ మొదటి షెడ్యూల్ తుది దశకు చేరుకుంది. రెండో షెడ్యూల్ ఏప్రిల్ మొదటివారంలో స్టార్ట్ కానుంది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతూకు జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్‌గా నటిస్తుండగా, చైతూ మిలటరీ ఆఫీసర్‌గా కన్పించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.













