Pawan Kalyan: స్టార్ డైరెక్టర్ తో పవన్ సినిమా?
టాలీవుడ్ లో హీరో హీరోయిన్ల బర్త్ డే సందర్భంగా వారు నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, కొత్త సినిమాల అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బర్త్ డే రాబోతుంది. మునుపటి కంటే భారీగా ఈ బర్త్ డే చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ బర్త్ డే కు ఓ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తోంది.
అదే పవన్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన అప్డేట్. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాక మళ్లీ కొత్త సినిమాలను ఒప్పుకుంటారా లేదా అనే సందేహంలో ఉన్న ఆడియన్స్ కు ఈ అనౌన్స్మెంట్ తో క్లారిటీ వచ్చే అవకాశముంది. శాండిల్ వుడ్ నిర్మాత కె. వెంకట నారాయణ(K Venkata Narayana)తో కలిసి పవన్ ఓ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్ లో పవన్ ఓ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ఒక తమిళ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ పవన్ బర్త్ డే కానుకగా వెల్లడి కానుందని అంటున్నారు. అదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే. మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే పవన్ నటించిన ఓజి(OG) సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.













