అడివి శేష్ ఆధ్వర్యంలో అకీరా కెరీర్
రీసెంట్గా ఓ షార్ట్ ఫిల్మ్ కి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సంగీతమిచ్చాడని తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకైపోయారు. రైటర్స్ బ్లాక్ అనే చిన్న షార్ట్ ఫిల్మ్ కి అకీరా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అడివి శేష్ స్పెషల్ గా ట్విట్టర్ లో మెన్షన్ చేస్తూ అందరినీ చూడమని కరాడు.
వీడియో చాలా చిన్నది. ఓ ఫేమస్ రైటర్ ఏం రాయాలో తెలియని ఓ విచిత్ర పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్నుంచి ఎలా బయటపడి తన కలాన్ని కదిలించాడనేదే ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ. చాలా చిన్న కథను ఎంతో సింపుల్ గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ కార్తికేయ యార్లగడ్డ. చూడ్డానికి ఆహా ఓహో అనేలా లేకపోయినా, ఒక మంచి ఐడియాను ఇలా ప్రెజెంట్ చేయడం వరకు మాత్రం బాగుంది.
ఇదిలా ఉంటే స్క్రీన్ పై అకీరాను హీరోగా చూడాలనుకున్న ఫ్యాన్స్ తో రేణూ దేశాయ్ ఈ మధ్య వివాదాస్పదంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో అకీరా మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమవ్వడం ఎవరూ ఊహించని విషయం. అయితే పవన్ తన కొడుకు అకీరా కెరీర్‌కు సంబంధించిన మొత్తం ప్లానింగ్ తనకు బాగా ఇష్టమైన వారిలో ఒకడైన అడవి శేష్ కు అప్పగించాడని ఎప్పటి నుంచో టాక్.
ఒకవేళ నిజంగానే అకీరా హీరోగా డెబ్యూ చేయాలనుకుంటే మాత్రం ఆ బాధ్యత కూడా అడవి శేష్ మీదే ఉండబోతుందని తెలుస్తోంది. ప్రొడక్షన్ కంపెనీ, డైరెక్టర్, స్టోరీ ఇలా మొత్తం శేష్ నే చూసుకోవాల్సి రావొచ్చు. దానికి ఎంత టైమ్ పడుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. మరి అకీరా ఎప్పుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నాడో చూడాలి.













