OG: పవన్.. ఓ పనైపోయిందిగా!

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేతిలో ఉన్న సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఓజి(OG). సుజీత్(Sujeeth) దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, ఆ తర్వాత ఓజి నుంచి రిలీజైన గ్లింప్స్ ఆ అంచనాలను మరింత పెంచింది. పవన్ అందుబాటులో ఉన్నన్ని రోజులు షూటింగ్ ను ఎంతో ఫాస్ట్ గా చేశాడు సుజీత్.
కానీ ఆ తర్వాత పవన్ ఎలక్షన్స్ లో బిజీ అవడం, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా మారి ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాలకు తగిన సమయం కేటాయించలేక పోయాడు. రీసెంట్ గా వీలు చూసుకుని తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తున్న పవన్, మొన్న వీరమల్లు(Hari Hara Veera Mallu)ను ఫినిష్ చేయగా, ఇప్పుడు ఓజి సినిమాలో తన పాత్ర షూటింగ్ ను ముగించేశాడు.
ప్యాకప్ ఫర్ గంభీర.. గేరప్ ఫది ది రిలీజ్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ రక్తంతో తడిచిన చేతులతో కనిపిస్తున్నాడు. అంటే ఓజిలో యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉండనున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ(Emran Hashmi) విలన్ గా నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య(DVV Danayya) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తుండగా, సెప్టెంబర్ 25న ఓజి ప్రేక్షకుల ముందుకు రానుంది.